నర్సరీలు మరింత అభివృద్ధి చెందేలా కృషి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:08 AM
స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని ‘లయన్స్ క్లబ్ ఆఫ్ కడియం హార్టికల్చర్’ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి కందులదుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.
లయన్స్‌క్లబ్ ఆఫ్ కడియం హార్టికల్చర్ ప్రమాణ స్వీకారం
ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల
కడియం, సెప్టెంబరు 15: స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని ‘లయన్స్ క్లబ్ ఆఫ్ కడియం హార్టికల్చర్’ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి కందులదుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం కడియపులంక నర్సరీ అసోసియేషన్ భవనంలో లయన్స్‌క్లబ్ కడియం హార్టికల్చర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్‌క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు హాజరయ్యారు.
లయన్స్‌క్లబ్ కార్యవర్గం
మాటూరి మంగతాయారు, పస్ట్‌వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్ర పు కోటేశ్వరరావు, అధ్యక్షుడిగా పుల్లా ఆంజనేయులు(అబ్బులు), కార్యదర్శిగా కర్రి ఎస్స య్య, కోశాధికారిగా నక్కా అమ్మిరాజు, లయన్స్‌క్లబ్ మెంబర్లు పుల్లా వీరవెంకట్రావు, పుల్లా పెదసత్యనారాయణ, పుల్లా వీర్రాజు, పుల్లా చినసత్యనారాయణ, పుల్లా రామకృష్ణ, పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్ పాల్గొన్నారు.
ముందుగా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి లయన్స్‌క్లబ్ మెంబర్లుగా జాయిన్ అయ్యారు. అనంతరం కమిటీ అంతా కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోర ంట్లను భారీ గజమాలలు వేసి, పూలకిరీటాలు పెట్టి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లయన్స్‌క్లబ్ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని, అటువంటి సేవాసంస్థ లయన్స్‌క్లబ్ ఆఫ్ హార్టికల్చర్ కడియంలో ఏర్పడటంతో పాటు ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. తాను, ఎమ్మెల్యే గోరంట్ల కలిపి కడియం నర్సరీలు అభివృద్ధి గురించి కలిసి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కడియం పీహెచ్‌సీకి డయాలసిస్ సెం టర్, బ్లడ్‌బ్యాంక్ తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌యాదవ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. కడియం నర్సరీలు మరింత అభివృద్ధి చెందాల్సి ఉందని కూటమి ప్రభు త్వం నర్సరీల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, పంతం గణపతి, వెలుగుబంటి నాని, మల్లు పోలరాజు, ముద్రగడ జమీ, గట్టి నర్స య్య, పాటంశెట్టి రాంజీ, పల్ల సుబ్రహ్మణ్యం, రత్నం అయ్యప్ప,ఆది మూలం సాయిబాబా, తాడాల చక్రవర్తి, నాగిరెడ్డి రామకృష్ణ, మల్లు శివ, లయన్స్‌క్లబ్ మాటూరి మంగతాయారు, నర్సరీరైతులు ఈలి బేబి, మార్ని జానకిరామయ్య, నర్సరీ సంఘం ప్రతినిధులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.