Share News

మన్యంలో మద్యం షాపులన్నీ స్థానిక గిరిజనులకే!

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:01 AM

మన్యంలోని మద్యం షాపులన్నీ స్థానికంగా ఉండే గిరిజనులకే ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించి 2024-26కు రూపొంది ంచిన మద్యం విధానంలో నిర్దేశించింది. ఈమేరకు రూపొందించిన నిబంధ నలలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి మా ర్గదర్శకాలను ఖరారు చేసిం ది. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు డివిజన్లలో మొ త్తంగా 40మద్యం షాపులకు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది.

మన్యంలో మద్యం షాపులన్నీ స్థానిక గిరిజనులకే!

అన్ని షాపులకూ పీసా గ్రామసభల ఆమోదం తప్పనిసరి

40 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన అల్లూరి కలెక్టర్‌

రంపచోడవరం, అక్టోబరు1: మన్యంలోని మద్యం షాపులన్నీ స్థానికంగా ఉండే గిరిజనులకే ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించి 2024-26కు రూపొంది ంచిన మద్యం విధానంలో నిర్దేశించింది. ఈమేరకు రూపొందించిన నిబంధ నలలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి మా ర్గదర్శకాలను ఖరారు చేసిం ది. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు డివిజన్లలో మొ త్తంగా 40మద్యం షాపులకు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రభుత్వం మద్యం విధానాన్ని రూపొందించడంలోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను గిరిజన ప్రాంతాల చట్టాలను దృష్టిలో ఉంచుకుని ఖరారు చేసింది.

పీసా నిబంధనల ప్రకారం కేటాయింపు

గిరిజన ప్రాంతాలకు కేటాయించిన షాపులన్నిటికీ గిరిజన ప్రాంతాల పంచాయతీరాజ్‌ చట్టం(పీసా) నిబంధనల ప్రకారం ఆయా గ్రామసభల నుంచి షాపుల ఏర్పాటుకు ఆమోదాలను తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస భల నుంచి నాలుగు వారాలలో ఆమోదం లభించని పక్షంలో, నాలుగువారాల అనంతరం దానిని ఆమోదం లభించినట్టుగానే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక్కడ షాపులన్నీ స్థానికంగా ఉండే గిరిజనులకే కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

షాపుల వివరాలు

రంపచోడవరం డివిజన్లో రంపచోడవరంలో రెండు, దేవీపట్నంలో ఒకటి, వై.రామవరంలో ఒకటి, అడ్డతీగలలో రెండు, గంగవరంలో ఒకటి, మారేడు మిల్లిలో ఒకటి, రాజవొమ్మంగిలో రెండు, చింతూరులో మూడు, ఎటపాకలో రెండు, కూనవరంలో ఒకటి, వి.ఆర్‌.పురంలో రెండు చొప్పున మద్యం షాపుల ను కేటాయిస్తూ కలెక్టరు నోటిఫై చేశారు. రంపచోడవరం ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌ స్పెక్టరు పరిధిలోని షాపులకు రంపచోడవరంలోనూ, చింతూ రు ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు పరిధిలోని షాపులకు చింతూరు లోనూ దరఖా స్తులను దాఖలు చేసుకోవచ్చు. ఈనెల 11న పాడేరులోని ఎస్పీ కార్యాలయం సమీ పంలోని వి.ఆర్‌.ఫంక్షన్‌ హాల్‌లో లాటరీ పద్ధతిన అన్నిషాపులకు లైసెన్సులను మంజూరు చేస్తారు.

హైవేల మీద, గుడి, బడి పక్కనా

మద్యం షాపులు ఉండొద్దు

మద్యం విధాన నిబంధనల్లో రాజీపడని కూటమి ప్రభుత్వం

జాతీయ రహదారులపైనా, రాష్ట్ర హైవేలపైనా, గుడిపక్కనా, బడి పక్కనా మద్యం షాపులు ఉండొద్దని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది. 2024-26 మద్యం విధానంలో ఎక్కడా కూడా హైవేలపైనా, గుడులు, బడులపైనా ఎక్కడా మద్యం షాపులు ఉండ కుండా నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. హైవేల ను ఆనుకుని కనుచూపు మేరలో ఎక్కడా కూడా మద్యం షాపులు ఉండొద్దని, జాతీయ రహదారి, స్టేట్‌ హైవేను ఆనుకుని 500 మీటర్ల పైబడిన ప్రాంతంలోనే ఈ షాపులను నెలకొల్పాలి. ఈ విధంగా మన్యం మీదుగా రాజమహేంద్రవరం నుంచి అరకు జాతీయ రహదారి పైనా, భద్రాచలం హైవేపైనా ఎక్కడా షాపులకు అవకాశం లేదు. 500 మీటర్ల లోపలకు షాపులను నెలకొల్పుకోవచ్చు. గుడులు, బడులు ఉన్నచోట 100 మీటర్ల పైబడి ఎక్కడా షాపులు ఉండరాదని నిబంధనల్లో పేర్కొంది.

మాకు న్యాయం చేయాలి

మద్యం షాపుల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

మద్యం దుకాణాల మూసివేత

బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయాలు

అనపర్తి, అక్టోబరు 1: ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం షాపులను మూసివేసి నిరసన తెలిపారు. గతనెల 30వ తేదీతో తమ గడువు ముగిసిందని తమ భవిష్యత్‌ అంధకారంగా మారిందని ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు. తమ అర్హతను బట్టి మద్యం డిస్పెన్షరీలలోగానీ మరో చోటగాని పని కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రైవే టు షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరంతా షాపులను మూసి వేసి నిరసన తెలుపుతున్నారు. వీరి సమ్మెతో మద్యం దొరకదని గ్రహించిన మందుబాబులు బ్లాక్‌ మార్కెట్‌ వైపుకు పరుగులు పెట్టడంతో నిర్వాహకులు మద్యం ధరలు పెంచేశారు. పుల్‌ బాటిల్‌కు రూ.500, క్వార్టర్‌కు రూ.100-150 అదనంగా వసూలు చేస్తున్నారు. సాయంత్రం 7గంటల సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల యూనియన్‌ నుంచి వచ్చిన సమాచారంతో అనపర్తి కెనాల్‌ రోడ్డులోని షాపును తెరవడంతో మందు బాబులు ఎగబడ్డారు. ఈనెల 5వ తేదీ వరకు వేచి చూడాలని రాష్ట్ర యూనియన్‌ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడక్కడా షాపులు తెరుచుకున్నట్టు సమాచారం.

Updated Date - Oct 02 , 2024 | 12:01 AM