నేమాంలో మాక్ డ్రిల్
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:40 AM
సర్పవరం జంక్షన్, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ సముద్రతీర ప్రాంతం నేమాం జగన్మోహనపురంలో శుక్రవారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సంస్థ ఆధ్వ ర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గెయిల్ సం స్థ జీఎం వై.ఏకుమార్ ఆధ్వర్యంలో ఓఎన్‌జీసీ, వేదాంత, కెయిర్న్స్‌ల సంయుక్త భా
సర్పవరం జంక్షన్, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ సముద్రతీర ప్రాంతం నేమాం జగన్మోహనపురంలో శుక్రవారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సంస్థ ఆధ్వ ర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గెయిల్ సం స్థ జీఎం వై.ఏకుమార్ ఆధ్వర్యంలో ఓఎన్‌జీసీ, వేదాంత, కెయిర్న్స్‌ల సంయుక్త భాగస్వామ్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు, జరుగుతున్న సమయం, తర్వాత తీసుకునే నివారణ, సహాయక చర్యలపై సిబ్బంది ప్రదర్శనాత్మకంగా విన్యాసాలు నిర్వహించారు. గ్యాస్ లీకేజీ జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం, అక్కడ నుంచి విపత్తు నివారణ కోసం పనిచేసే యం త్రాంగం, స్బిబందికి సమాచారం వెళ్లడం, నివారణ చర్యలను సిబ్బంది విన్యాసం చేసి చూపించారు. ఈ సందర్భంగా జీఎం వైఏ కుమార్ మా ట్లాడుతూ గ్యాస్ లీకేజీపై ప్రజలను అప్రమత్తం చేయడం, విపత్తుల నివారణ కోసం పునశ్చరణ కార్యక్రమం ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. నెలకోసారి ఆన్ సైట్‌లో సేఫిటీ భద్రత, ప్రమాదాల నివారణ కోసం తీసుకునే చర్యలపై డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ సర్పంచ్ రాందేవు చిన్న, అగ్నిమాపక కేంద్రం అధికారి టీవీఎస్ రాజేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్, ఏడీఎఫ్‌వో సుబ్బారావు, ఎంపీడీపీ పసుపులేటి సతీష్, తహశీల్ధార్ వీ ఎల్‌ఎన్ కుమారి, ఈవోపీఆర్‌డీ శ్రీరామ ఆంజనేయులు, రిజర్వు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.