మా ఉద్యోగం.. మాకు ఇప్పించండి సార్..
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:43 AM
మా ఉద్యోగం మాకివ్వండి సార్.. మీరు స్పందించకపోతే 250 కుటుంబాలు రోడ్డున పడతాయంటూ బలభద్రపురం శివారు కానేడులోని గ్లూకోజ్ ఫ్యాక్టరీ కార్మికులు వాపోయారు.
బిక్కవోలు, ఫిబ్రవరి 12 : మా ఉద్యోగం మాకివ్వండి సార్.. మీరు స్పందించకపోతే 250 కుటుంబాలు రోడ్డున పడతాయంటూ బలభద్రపురం శివారు కానేడులోని గ్లూకోజ్ ఫ్యాక్టరీ కార్మికులు వాపోయారు. కార్మికులందరూ సోమవారం తమ కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని కలిశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమ లేఆఫ్‌ను ప్రకటించి మూడు నెలలుగా తమను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న 250 మంది కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వెలిబుచ్చారు.ఫ్యాక్టరీ అక్రమంగా ప్రకటించిన లేఆఫ్‌ను ఎత్తివేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మూర్తి, రామచంద్రరావు, కార్మిక సంఘ అధ్యక్షుడు ఏ.నాగేశ్వరరావు, నేతలు వి. రాంబాబు, కె. వెంకటరమణ, కుటుంబీకులతో కార్మికులు ఉన్నారు.