కొత్తపేట పారిశుధ్య పనుల్లో సిబ్బంది, పాలకమండలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:16 AM
కొత్తపేటలో పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆ పనులు చేసేందుకు ఆదివారం సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం రోడ్డెక్కింది
కొత్తపేట, సెప్టెంబరు 15: కొత్తపేటలో పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆ పనులు చేసేందుకు ఆదివారం సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం రోడ్డెక్కింది. కొత్తపేట మేజర్ పంచాయతీలో పాలకవర్గానికి, పారిశుధ్య సిబ్బందికి మధ్య జీతాల చెల్లింపు విషయంలో వివాదం ఏర్పడింది. పారిశుధ్య పనులు చేపట్టకుండా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి జీతాలు చెల్లింపునకు బిల్లు పెట్టింది. అయినా విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహించిన పారిశుధ్య కార్మికుల్లో కొందరిని తప్పించి మిగిలిన వారిని విధులకు రప్పించారు. దీనిపై పాలకవర్గం, పారిశుధ్య కార్మికుల మధ్య వివాదం నడిచింది. ఈనేపథ్యంలో కొంతమంది సిబ్బందితో కలిసి పాలకవర్గమే పారిశుధ్య పనులు చేసేందుకు నిర్ణయం తీసుకుని ఆదివారం సర్పంచ్ బూసి జయలక్ష్మిభాస్కరరావు ఆధ్వర్యంలో నడుంబిగించారు. గ్రామసంత మార్కెట్ ఏరియాలో, ప్రధా నరహదారిలో ఉన్న పేరుకుపోయిన చెత్తను తొలగించారు. కొందరు కార్మికులను తప్పించడంపై పారిశుధ్య కార్మికుల్లో ఆందోళన నెలకొంది. వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని యఽథావిధిగా పనులు చేస్తామని ముఖ్యనాయకుల వద్ద వారు వాపోయారు. ఉపసర్పంచ్ విళ్ల మారుతీప్రసాద్, కంఠంశెట్టి శ్రీనివాసరావు, కాశీ ధనరాజు, బయ్యే రాంబాబు, దేవపాటి వెంకటేశ్వరరావు, బండి రాజు, కడలి భీమేష్, లంక సుబ్రహ్మ ణ్యం, టీడీపీ నేతలు కముజు వెంకటేశ్వరరావు, యల్లమిల్లి జగన్మోహన్, వాసంశెట్టి సత్యనారాయణ, చోడపనీడి భాస్కరరావు, బూసి విష్ణు, బూసి వెంకటరమణ, ములపర్తి శ్రీను, ముద్రగడ ఫణి పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు.