జాతీయ ఉపాధి హామీ పథకంలో రహదారులు, డ్రైన్ పనులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:48 AM
జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రైయిన్స్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం డ్వామా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 11: జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రైయిన్స్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం డ్వామా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిపాదించే పనుల విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయా పనులను చేపట్టాల్సి ఉంటుంద న్నారు. సాంకేతిక అంశాలను కూడా పరిగణంలోకి తీసుకుని ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పనులకు చెందిన పరిపాలన ఆమోదంతో మాత్రమే పను లు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు 966 పనులకుగాను రూ.89 కోట్ల 75లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయా పనుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు చేప ట్టామన్నారు. నాలుగు కోట్ల77లక్షలతో 36 పను లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ప్రతిపాదించే పనుల్లో సిమ్మెంట్‌రోడ్డు, డ్రైనేజీ, అనుసం ధాన రహదారుల(లింక్) పనులను చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామసభల్లో నిర్ధారించిన పనులకు ప్రాధాన్యం ఇస్తామన్నా రు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఆర్.శ్రీరాములు నాయుడు, అర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ డి.బాలశంకరరావు, అధికారులు పాల్గొన్నారు.