Share News

పెరుగుతున్న గోదావరి.. లంకల్లో పడవ ప్రయాణం

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:13 AM

భారీ వర్షాలకు గోదావరి ఎగు వన వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు భారీగా వరద వచ్చి చేరుతుంది.

పెరుగుతున్న గోదావరి.. లంకల్లో పడవ ప్రయాణం

లంక గ్రామస్తులు పడవలపైనే ప్రయాణం

పి.గన్నవరం, సెప్టెంబరు 4: భారీ వర్షాలకు గోదావరి ఎగు వన వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ నుంచి దిగువకు సముద్రంలోకి వరద నీటిని విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలోని నదీపాయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. రెండు రోజులు క్రితం పెరిగిన వరద ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వేపైకి వరదనీరు చేరి అనంతరం తగ్గింది. ప్రస్తుతం మళ్లీ వరద ఉధృతి పెరుగుతుండటంతో కాజ్‌వేపైకి నీరు చేరనుంది. గంటిపెదపూడి శివారు పెదపూడిలంక, అరి గెలవారిపేట, బూరుగులంక, ఉడిమూడి శివారు ఉడిమూడి లంక గ్రామస్తులు బూరుగులంక నదీపాయ వద్ద పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అనగా ర్లంక, పెదమల్లంక తదితర గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో మం డల, గ్రామస్థాయి అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. రామచంద్రపురం ఆర్డీవో ఎస్‌.సుధాసాగర్‌, తహశీల్దార్‌ పి.శ్రీప ల్లవి, ఎంపీడీవో ఎం.భారతీలు బూరుగులంక నదీపాయ, మానేపల్లి శివారు శివాయిలంక, పల్లిపాలెం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి స్థానిక గ్రామస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలోని 12లంక గ్రామాలకు వీఆ ర్వో, పంచాయతీ కార్యదర్శులను టీమ్స్‌గా ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్‌ శ్రీపల్లవి తెలిపారు. విద్యుత్‌శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అప్రమత్తం చేసి ముఖ్యమైన నదీపాయలు వద్ద 24గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 12:13 AM