‘బాణసంచా’ రాద్ధాంతం ముగిసింది..
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:39 AM
నగరంలో తలెత్తిన బాణసంచా దుకాణాల రాద్ధాంతం ముగిసింది. ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ ఽథియేటర్ ఎదురుగా ఖాళీస్థలంలోను, సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి స్థలంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణం అనుమతులను అధికారులు రద్దు చేయ డంతో దుమారం రేగింది.
కాకినాడ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో తలెత్తిన బాణసంచా దుకాణాల రాద్ధాంతం ముగిసింది. ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ ఽథియేటర్ ఎదురుగా ఖాళీస్థలంలోను, సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి స్థలంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణం అనుమతులను అధికారులు రద్దు చేయ డంతో దుమారం రేగింది. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు మ ల్లిపూడి వీరు, పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు. దీంతో అధికారులు మెయిన్‌రోడ్‌లోనే కౌస్తుభా హోటల్ సమీపాన ఖాళీస్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేసు కునేందుకు సిటీ ఎమ్మెల్యే తరపువారికి అనుమతిచ్చారు. ఇక మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్, బోటు క్లబ్ స్థలంలో దుకాణాలు ఏర్పాటుచేశారు.