విప్లవకారుల త్యాగాలను వృథాకానివ్వం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:01 AM
పాలకులు నిరంకుశ విధానాలను ప్రతిఘటిస్తూ ప్రాణాలర్పించిన విప్లవకారుల త్యాగాలను వృథాకానివ్వబోమని రైతు కూలీ సం ఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం పీడీఎస్‌యూ వి జృంభన జిల్లా కార్యదర్శి శ్రీ కాంత్ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభ లో కర్నాకుల మాట్లాడుతూ భూమి కోసం, భుక్తికోసం పీడిత ప్రజల విముక్తికోసం పోరాడిన వారి త్యాగాలను వృథాకానివ్వబోమన్నారు.
అమరవీరుల సంస్మరణలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 29( ఆంధ్రజ్యోతి): పాలకులు నిరంకుశ విధానాలను ప్రతిఘటిస్తూ ప్రాణాలర్పించిన విప్లవకారుల త్యాగాలను వృథాకానివ్వబోమని రైతు కూలీ సం ఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం పీడీఎస్‌యూ వి జృంభన జిల్లా కార్యదర్శి శ్రీ కాంత్ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభ లో కర్నాకుల మాట్లాడుతూ భూమి కోసం, భుక్తికోసం పీడిత ప్రజల విముక్తికోసం పోరాడిన వారి త్యాగాలను వృథాకానివ్వబోమన్నారు. కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కొండ దుర్గారావు, బి.రమేష్, మడికి సత్యం, డి.సురేష్, పీడీఎస్‌యూ నాయకుడు కడితి సతీష్, మహిళా సంఘం నాయకురాలు నిరీక్షణ, డాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.