ముంపులో 18,012 హెక్టార్ల పంట
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:11 AM
జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలకు పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. జిల్లాలో 143గృహాలు దెబ్బతిన్నాయి. దీనిలో 14 గృహాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. మిగిలిన గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిలో అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 24 ఇళ్లు, యు.కొత్తపల్లి మండలంలో 23 ఇళ్లు, సామర్లకోట మండలంలో 21 ఇళ్లు ఉన్నట్లు ప్రాథమిక నివే దికలో పేర్కొన్నారు.
27,561మంది రైతులకు భారీ నష్టం
రూ.79కోట్లు నష్టంగా అంచనా
రూ.30కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కావాలని ప్రతిపాదనలు
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 11: జిల్లాలో భారీవర్షాలు, వరదలవల్ల పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 18,012 హెక్టార్లలో పంటలు ముంపులో ఉన్నాయి. దీనివల్ల 27,561 మంది రైతులు నష్టపోయారు. దీనివల్ల 33,250 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేశారు. దీనివల్ల రూ.79.51కోట్లు ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నా రు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిమిత్తం రూ.30కోట్ల58లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ప్రధా నంగా జిల్లాలో గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని, ఏలేశ్వరం, యు.కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో నష్టం జరిగినట్లు గుర్తించారు. దీనిలో వరిపంట అత్యధికంగా 17,432మంది రైతులకు నష్టం జరిగింది. వరి పంట అత్యంత కీలక దశలో ఉండడంతో రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి 520 హెక్టార్లలో, మొక్కజొన్న 24 హెక్టార్లలో, మినుము 36 హెక్టార్లలో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా పేర్కొన్నారు. దీనిలో చిన్న, సన్నకారు రైతులు 26,191మంది కాగా ఇతరరైతులు 1370మంది ఉన్నా రు. ఏలేరు, పంపా, తాండవ నది పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద నీటి ప్రవాహం కొన సాగడంవల్ల నష్టం పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈప్రాథమిక అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. 33శాతంలోపు నష్టం జరిగిన పంట పొలాలు వేలాది హెక్టా ర్లు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వరదనీరు ఉధృతి తగ్గితే వాటి నష్టం అంచనా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
వరదలతో భారీగా ఆస్తినష్టం
143 గృహాలు దెబ్బతిన్నాయి
225 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 11: జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలకు పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. జిల్లాలో 143గృహాలు దెబ్బతిన్నాయి. దీనిలో 14 గృహాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. మిగిలిన గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిలో అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 24 ఇళ్లు, యు.కొత్తపల్లి మండలంలో 23 ఇళ్లు, సామర్లకోట మండలంలో 21 ఇళ్లు ఉన్నట్లు ప్రాథమిక నివే దికలో పేర్కొన్నారు. పిఠాపురం మండలంలో ఒకటి, గొల్ల ప్రోలులో 10, కాకినాడ రూరల్‌లో 9, కరపలో ఒకటి, పెద పూడిలో 2, కాజులూరులో 2, గండేపల్లిలో 8, పెద్దాపురంలో ఒకటి, కోటనందూరులో 3, కిర్లంపూడిలో ఒకటి, తునిలో 6, తొండంగిలో 12, రౌతులపూడిలో 7, శంఖవరంలో 12గృహాలు దెబ్బతిన్నాయి. దీంతో బాధితులు సమీపంలో ఉన్న పునరా వాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. జిల్లాలో 225 కిలోమీటర్ల మేరకు రోడ్లు ధ్వంసమ య్యాయి. దీనిలో 69 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర రహదారులు, 179 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రోడ్లు తాత్కాలిక పున రుద్ధరణ నిమిత్తం రూ.5కోట్లు, శాశ్వత నిర్మాణాల కోసం రూ.77.90కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో నీటిపారుదలశాఖలో 26 ప్రధాన నీటిపారుదల పనులు, 2,463 కిలోమీటర్ల 18 కట్టలు ధ్వంసమయ్యాయి. దీనికి రూ.61.64లక్షలు కావాలని పేర్కొన్నారు. భారీవర్షాలవల్ల వీరవరం వద్ద ఉన్న 33కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, సామర్లకోటలో సబ్‌స్టేషన్‌లు తాత్కాలికంగా దెబ్బతిన్నాయి. కృష్ణవరం వద్ద ఉన్న 11కేవీ ఏబీఎస్ నిర్మాణం కూలిపోయింది. జిల్లావ్యాప్తంగా 11 విద్యుత్ స్తంభాలు, 11కేవీ కండక్లర్ దెబ్బతిన్నది. 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమయ్యాయి. దీనివల్ల పవర్ సప్లయి నిలిచిపోయింది.
జిల్లాలో రూ.212కోట్ల నష్టం: కలెక్టర్
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 11: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలవల్ల జిల్లాలో రూ.212 కోట్లు పంటలు, ఆస్తినష్టం జరిగినట్లు కలెక్టర్ షాన్‌మోహన్ వెల్లడించారు. అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నివేదిక రూపొందించామన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. గొల్లప్రోలు మండలం, పిఠాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, కిర్లంపూడి, ఏలేశ్వరం, పెద్దాపురం మండలాల్లో అధిక నష్టం జరిగిందన్నారు. వరద నీరు ఇంకా ప్రవాహాం జరుగుతున్నందున నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే బాధితులకు పంపిణీ చేస్తామన్నారు.