పనిచేస్తుండగానే.. ప్రాణం పోయింది..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:33 AM
వరి కోత మిషన్ డ్రైవర్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
నల్లజర్ల,సెప్టెంబరు 15 : వరి కోత మిషన్ డ్రైవర్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లజర్ల మండలం పడమర చోడవరం గ్రామానికి చెందిన తానింకి నాగేంద్ర(30) అదే గ్రామానికి చెందిన నూనేసత్యనారాయణకు చెందిన వరి కోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం అనంతపల్లి గ్రామానికి చెందిన రైతుకు చెందిన వరి పొలం కోతకు రావడంతో కోత ప్రారంభించారు.మిషన్ ట్యాంకు నిండిపోవడంతో ధాన్యం ట్రాక్టర్‌లోకి పోసే క్రమంలో ధాన్యం బయటకు రాలేదు. దీంతో నాగేంద్ర ట్యాంకుపైకి ఎక్కి సరిచేసే క్రమంలో పైనే ఉన్న 11కేవి విద్యుత్ వైర్లు చేతికి తగిలి అక్కడిక్కడే మృతిచెందాడు.మృతదేహాన్ని పోస్టుమర్డం నిమి త్తం తాడేపల్లిగూడెం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.మృతుడికి భార్య రాణి,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.