వైసీపీ పాలనలో కార్పొరేషన్లకు నిధులు నిల్: సుభాష్
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:14 AM
శెట్టిబలిజ బీసీ కార్పొరేషన్లకు వైసీపీ హయాంలో నిధులు ఇవ్వలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు.
అల్లవరం, సెప్టెంబరు 15: శెట్టిబలిజ బీసీ కార్పొరేషన్లకు వైసీపీ హయాంలో నిధులు ఇవ్వలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. తూర్పులంకలో శెట్టిబలిజ సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు(కేవీ) అధ్యక్షతన ఆదివారం జరిగిన టీడీపీ కూటమి శెట్టిబలిజ ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో సెటిల్‌మెంట్ దందాలపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు కృష్ణా వరద బాధితులను ఆదుకున్న తీరు చారిత్రాత్మకమన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో సీసీ రోడ్లు లేవని, కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ప్రజలను మోసగించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్ పథకాలు మరో ఆరు నెలలో అమలు జరుగుతాయన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే వారిని గుర్తించాలని, కృష్ణా వరద బాధితులకు చంద్రబాబు అన్ని విధాల అండగా నిలిచారని టీడీపీ రాష్ట్ర నాయకుడు పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షుడు పెచ్చెట్టి విజయలక్ష్మి అన్నారు. మంత్రి సుభాష్, ఎమ్మెల్యే ఆనందరావు, చంద్రమౌళి, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజును ఘనంగా సత్కరించారు. సదస్సులో గుబ్బల రామ్‌ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు, దొంగ శ్రీను, మామిడిశెట్టి శ్రీరామ్, గెద్దాడ శ్రీనివాస్, కొప్పిశెట్టి రామకృష్ణ, కడలి దుర్గాప్రసాద్, ఎంపీటీసీ మామిడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.