అయోమయంలో బోట్ల నిర్వాహకులు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:17 AM
విఆర్‌పురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారుల కొత్త నిబం ధనలతో పాపికొండలు, పేరంటాలపల్లి విహార యాత్రకు వెళ్లే బోట్ల నిర్వాహకులు అయోమ యంలో పడ్డారు. ఎన్నడూ లేని విధంగా 50 మంది పర్యాటకులు బోట్‌పై విహార యాత్రకు వెళ్లాలంటే బోట్ నిర్వాహకులు రూ.2500, 100
అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారుల కొత్త నిబంధనలు
విఆర్‌పురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారుల కొత్త నిబం ధనలతో పాపికొండలు, పేరంటాలపల్లి విహార యాత్రకు వెళ్లే బోట్ల నిర్వాహకులు అయోమ యంలో పడ్డారు. ఎన్నడూ లేని విధంగా 50 మంది పర్యాటకులు బోట్‌పై విహార యాత్రకు వెళ్లాలంటే బోట్ నిర్వాహకులు రూ.2500, 100 మంది పర్యాటకులతో విహార యాత్రకు బోట్ వెళ్తే రూ.4000 కట్టాలని అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో బోట్ల నిర్వాహకులు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బోట్ నిర్వాహ కులు మాదిరెడ్డి సత్యనారాయణ, సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ పాపికొండలకు వచ్చే ప్రతి వాహనం దగ్గర ఫారెస్టు అధికారులు అభయ అరణ్యం పేరుతో రూ.50 నుంచి 100 వసూలు చేస్తున్నారని, ఇప్పుడు మాపై ఇంత భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తు న్నారు. ప్రస్తుతం పర్యాటకం అంతంత మాత్రం గానే ఉందని, ఈ విషయంపై ఉన్నతస్థాయి అధికారులు స్పందించి అటవీశాఖ అధికారులు కొత్తగా పెట్టిన నిబంధనలను ఉపసంహరించుకో వాలని భద్రాద్రిబోట్ యూనియన్ తరుపున కో రారు. ఈ విషయమై విఆర్‌పురం ఇన్‌చార్జి రేంజ ర్ అధికారి మూర్తిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా అటవీశాఖ ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల తోనే పోచవరం బోట్ పాయింట్ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.