Share News

‘బెల్టు’ తీస్తారా..

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:24 AM

త వైసీపీ సర్కారు హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం విక్రయించి మందుబాబుల ఆరోగ్యంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆడుకున్నారు.

 ‘బెల్టు’ తీస్తారా..

జిల్లాలో కొన్ని ప్రైవేటు మద్యం దుకాణాలు అక్రమాలకు తెరతీశాయి. మందుబాబులును నిలువునా పిండేసేలా అధిక ధరలకు మద్యం విక్రయాలు మొదలుపెట్టాయి. లైసెన్స్‌ ఫీజులు లక్షల్లో కడుతున్నామనే సాకుతో ఎమ్మార్పీలను ఉల్లంఘించి అమ్మకాలు జరుపుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులకు సైతం దుకాణాల నుంచే మద్యం విక్రయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రైవేటు మద్యం దుకాణాలపై వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని ఎక్సైజ్‌శాఖ అప్రమత్తమైంది. అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తే పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. బుధవారం నుంచి ఇవి రంగంలోకి దిగబోతు న్నాయి. బెల్ట్‌షాపులకు మద్యం దుకాణాల నుంచి సరుకు సరఫరా అయినా, అటు ఎమ్మా ర్పీలను ఉల్లంఘించినా పట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అందులోభాగంగా మారు వేషాల్లో వెళ్లి మద్యం కొనుగోలు చేయడం ద్వారా వైన్‌షాపులకు అధికారులు షాక్‌ ఇవ్వనున్నారు. తొలిసారి దొరికితే రూ.5 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేస్తారు. ఒకపక్క ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంటే మరోపక్క కొందరు కూటమి ఎమ్మెల్యేల బంధువులు బెల్ట్‌షాపులకు వేలం వేస్తుండడం విశేషం.

జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలు గీతదాటకుండా ప్రభుత్వం చర్యలు

ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు దుకాణాలకు మద్యం విక్రయాలపై అప్రమత్తం

ఇటీవల అధిక ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం సమీక్షతో ఎక్సైజ్‌ శాఖ పరుగులు

వైన్‌షాపులపై నిఘాకు సన్నాహాలు మొదలుపెట్టిన జిల్లా ఎక్సైజ్‌శాఖ

15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. నేటి నుంచి మారువేషాల్లో నిఘా

అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ తొలిసారి పట్టుబడితే రూ.5 లక్షల ఫైన్‌

మళ్లీ దొరికితే లైసెన్స్‌ రద్దుకు ఆదేశాలు.. యానాం మద్యంపైనా తనిఖీలు

మరోపక్క జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల బంధువులు బెల్ట్‌ దందా మొదలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ సర్కారు హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం విక్రయించి మందుబాబుల ఆరోగ్యంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆడుకున్నారు. తద్వారా కోట్లలో సంపాదించారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ దందాకు చెక్‌ పెట్టిం ది. మందుబాబుకు నాణ్యమైన మద్యం అందించడం, ధరలు తగ్గించి ప్రైవేటు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈనెల నుంచి జిల్లాలో 155 ప్రైవేటు మద్యం దుకాణాల్లో మ ద్యం అమ్మకాలు మొదలయ్యాయి. అయితే ఒకపక్క ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలకు చెక్‌పెట్టి సం స్కరణలు తీసుకురాగా, మరోపక్క కొన్ని ప్రైవేటు మద్యం దుకాణాలు అప్పుడే అక్రమాలకు తెరతీశాయి. భారీగా సంపాదించడం కోసం ఏకంగా మద్యం దుకా ణాల్లో మందును ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్ర యిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి ఏడు నుంచి పది వరకు జరుగుతున్న విక్రయాల్లో ఈతరహా ఉల్లంఘ నలు అధికంగా జరుగుతున్నాయి. అలాగే మండలా లు, నియోజకవర్గ కేంద్రాల్లో వైన్‌షాపులు లేనిచోట్ల సదరు దుకాణాల నిర్వాహకులు ఏకంగా బెల్ట్‌ షాపు లు నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల బెల్ట్‌ నిర్వాహ కులతో చేతులు కలుపుతున్నారు. అందులోభాగంగా వైన్‌షాపులో సరుకును బెల్ట్‌ దుకాణాలకు చేర్చుతు న్నారు. అక్కడ కల్తీ చేయడంతోపాటు ఎక్కువ ధరల కు విక్రయిస్తున్నారు. అయితే ఈ దందాలో కొందరు కూటమి ఎమ్మెల్యేల బంఽధువులు నేరుగా జోక్యం చేసు కుంటున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ నియోజకవర్గంలో సదరు ఎమ్మెల్యే మేనల్లుడు ఏకం గా తనకు కొంత వాటా ఉన్న వైన్‌షాపు నుంచే బెల్ట్‌ దుకాణాలకు సరుకు వెళ్లాలని ఆదేశించాడు. ఇలా తీసుకువెళ్లే వారంతా ఆ వైన్‌షాపు వద్ద రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయాలని హుకుం జారీచేశారు. అలాగే మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పది గ్రామాల్లో ఎనిమిదిచోట్ల బెల్ట్‌షాపులు నిర్వహిస్తుంటే వారందరి నీ పిలిచి అందరి తరఫున ఒకరే సరుకు విక్రయించా లని డ్రా తీసి సదరు వ్యక్తిని ఎంపిక చేశారు. హైవే ను ఆనుకుని ఉన్న రెండు నియోజకవర్గాల్లోను ఇదే దందా మొదలైంది. ఇలా ఎక్కడికక్కడ అనేకచోట్ల ఎమ్మెల్యేల బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఫిర్యాదులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లం ఘనలు, బెల్ట్‌ దుకాణాలకు సరుకు తరలినా కఠి నంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష లో ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాలోని ఆ శాఖ అధికారులు మంగళవారం రాత్రి వరకు ప్రత్యేక బృందాల ఏర్పాటుపై కసరత్తు జరిపారు.

మారువేషాల్లో కొనుగోలు..

ఎమ్మార్పీ ఉల్లంఘనలపై నిఘాకు జిల్లాలో మొత్తం 15 బృందాలను ఏర్పాటుచేస్తూ మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. ఒక బృందంలో సీఐ, కానిస్టేబుళ్లు, మరికొన్ని బృందాల్లో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ఉండేలా ప్రత్యేక టీంలు సిద్ధం చేశారు. ఇవన్నీ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలపై నిఘా పెట్టనున్నాయి. మారువేషాల్లో సైతం మద్యం దుకాణాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేయనున్నాయి. ఎక్కడైనా ఎమ్మార్పీకి మించి సరుకు విక్రయిస్తే వెంటనే సంబంధిత దుకాణం నిర్వాహకు డిపై కేసు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. అదే దుకాణం రెండోసారి అధిక ధరలకు మద్యం విక్రయించినట్టు తేలితే షాపు లైసెన్సు రద్దు చేనున్నారు. అయితే ఏరోజు ఎక్కడ నిఘా వేయాలో, దాడులు చేయాలనేది అప్ప టికప్పుడు ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. అలాగే ఆయా బృందాలు రోజు వారీ ఏంచేశాయనేది ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇవ్వాలని నిబంధన విధించారు. ఇదిలాఉంటే బెల్ట్‌ దుకాణాలకు జిల్లాలో కొన్ని షాపుల నుంచి సరుకు భారీగా వెళ్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో రాత్రివేళల్లో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున ప్రత్యేక బృందాలు తనిఖీ చేయనున్నాయి. అక్కడ కల్తీతో పాటు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తుండడంతో బెల్ట్‌ నిర్వాహకులపైనా కేసులు నమోదుచేయనున్నారు. మరోపక్క జిల్లాలోకి యానాం నుంచి సైతం ఇప్పటికి మద్యం అడ్డదారిలో వస్తోంది. నాటుసారా సైతం గోదావరి కాలువల ద్వారా గ్రామాల్లోకి భారీగా వస్తోంది. దీంతో దీనిపైనా నేటి నుంచి నిఘా ముమ్మరం చేస్తున్నట్టు జిల్లా ఎక్సైజ్‌ అధికారి వివరించారు.

Updated Date - Oct 30 , 2024 | 06:29 AM