బీసీలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:04 AM
అబద్దపు హామీలు, కల్లబొల్లి కథలు చెప్పి అధికారంలోకి వచ్చాకా జగన్‌రెడ్డి బీసీలను వెన్ను పోటు పొడిచారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. బొమ్మూరులోని నరశింహరాజు కల్యాణ మండపంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
జయహో బీసీ సదస్సులో ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్ , ఫిబ్రవరి 12: అబద్దపు హామీలు, కల్లబొల్లి కథలు చెప్పి అధికారంలోకి వచ్చాకా జగన్‌రెడ్డి బీసీలను వెన్ను పోటు పొడిచారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. బొమ్మూరులోని నరశింహరాజు కల్యాణ మండపంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలో సగ భాగమైన బీసీలను ఏనాడూ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మొదటి నుంచి బీసీలకు టీడీపీ అండగా ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో గౌరవాన్ని కల్పించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా 300 మంది బీసీలను పొట్టనపెట్టుకుందని, వందలాది మందిపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపించారన్నారు. కార్యక్రమంలో మత్యేటి శివసత్య ప్రసాద్, చెల్లుబోయిన శ్రీను, మార్గాని సత్యనారాయణ, నూర్ భాషా, షేక్ సుభాన్, మేడిశెట్టి శ్రీను వెలుగుబంటి నాని, పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు పాల్గొన్నారు.