Share News

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు 30మంది ఎంపిక

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:43 AM

పిఠాపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు 30మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూని

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు 30మంది ఎంపిక
ఎంపిక పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు

పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ పోటీలు

పిఠాపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు 30మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానం ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆ ర్చరీ జట్ల ఎంపికకు శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన 30మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని, వారు విజయవాడలో డిసెంబరు 3నుంచి 5వ తేదీ వరకూ జరిగే రాష్ట్రస్థాయి సీనియర్స్‌ ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జేఎన్‌ఎస్‌ గోపాలకృష్ణ, పి.లక్ష్మణరావు తెలిపారు. పోటీల్లో విజేతలు, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనవారికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ బహుమతులు అందజేశారు. అంతకు ముందు పోటీలను జనసేన నేతలు జోగా వెంకటరమణ, మార్నీడి రంగబాబు, సతీష్‌ ప్రారంభించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా జి.శివప్రసాద్‌, కె.చిన్నబ్బాయి, బి.కృష్ణార్జున వ్యవహరించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:43 AM