Share News

సినీ పరిశ్రమ ఏపీలో స్థిరపడేందుకు కృషి : మంత్రి దుర్గేష్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:11 AM

సినీ పరిశ్రమ ఆంధ్ర పదేశ్‌లో స్థిరపడేందుకు కృషి చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం షెల్టన్‌ హోటల్‌ లో 4కె ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా టైటిల్‌ను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.

సినీ పరిశ్రమ ఏపీలో స్థిరపడేందుకు కృషి : మంత్రి దుర్గేష్‌
గ్రామ ప్రజలకు విఙ్ఞప్తి సినిమా టైటిల్‌ అవిష్కరణ కార్యకమ్రంలో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం కల్చరల్‌, సెప్టెంబరు 15: సినీ పరిశ్రమ ఆంధ్ర పదేశ్‌లో స్థిరపడేందుకు కృషి చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం షెల్టన్‌ హోటల్‌ లో 4కె ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా టైటిల్‌ను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ సినిమాల చిత్రీకరణకు కోనసీమ,తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాలు ఎంతో అనువైనవని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రేక్షకుల ఆదరణ తోనే చాలా సినిమాలు విజయవంతమయ్యాయన్నారు. తెలంగాణా రాష్ట్ర తో పోల్చితే, మన రాష్ట్రం నైసర్గిక స్వరూపంలో పెద్దదైనప్పటికీ, సినిమా నిర్మాణానికి తగిన సౌకర్యాలు లేవని అన్నారు. సినిమా పరిశ్రమపై సీఎం చంద్రబాబు సదాభిప్రాయం ఉందని, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే స్థిర లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. పలువురు ప్రముఖులు ఏపీలో సినిమా స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కోరారని చెప్పారు. ఇక్కడి నుంచి తెలంగాణాకు చిత్రపరిశ్రమ ద్వారా 63శాతం దాకా నిధులు వెళుతున్నాయన్నారు. ఏపీలో ఎందరో టెక్నిషియన్లు, కళాకారులు, ఆర్టిస్టులు ఉన్నారన్నారు. ఈ సినిమాకు ప్రముఖ హాస్యనటుడు గౌతమ్‌రాజు నేతృత్వం వహించడం అభనందనీయమన్నారు. సిని మా దర్శకుడు సాయి విజయ్‌ శ్రీరామ్‌, నిర్మాత ముంజులూరి పవన్‌ కు మార్‌, హీరో సందీప్‌,హీరోయిన్‌ కావేరి, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:12 AM