అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు : జేసీ
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:36 AM
తెల్లరేషన్‌కార్డున్న అర్హులైన లబ్ధిదారులందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు అందించే కార్యక్రమా నికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా చెప్పారు.
కలెక్టరేట్(కాకినాడ),అక్టోబరు29(ఆంధ్రజ్యోతి): తెల్లరేషన్‌కార్డున్న అర్హులైన లబ్ధిదారులందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు అందించే కార్యక్రమా నికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా విలేకరుల సమావేశం నిర్వహించి ఉచిత గ్యాస్ సిలిం డర్ల విషయాలను వెల్లడించారు. ముందుగా గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడు ఏజన్సీకే ఆ నగదును చెల్లించాలని, తర్వాత వారి నెంబ రుకు ఒక మెసేజ్ వస్తుందని పట్టణ ప్రాం తాల్లో ఒకరోజులోను, గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారన్నారు. మంగళవారం నుంచి మార్చి 31వ తేదీ 2025 వరకు సిలిండర్ పొందే లబ్ధిదారులు ఆ గ్యాస్ ఏజెన్సీల వద్ద బుక్ చేసుకోవాలన్నారు. ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నెంబరు 8886903611 ఫోన్‌చేసి తెలు సుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అందిస్తున్న రీతిలోనే, రాష్ట్ర ప్రభు త్వం పేద కుటుంబాల మహిళలకు కానుకగా ఈ దీపావళి పండుగ నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రయోజనం పొందేందుకు లబ్ధిదారులు ఆధార్ నెంబరు, రేషన్‌కార్డు నెంబరు, ఆధార్ లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉండాలన్నారు. ఈ అంశాలు కలిగిన లబ్ధిదారుల జాబితాలు ఆయా ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఏజన్సీల వద్ద ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 6 లక్షల 50 వేలమంది తెల్లరే షన్, బియ్యం కార్డు కుటుంబాలు ఉన్నాయన్నా రు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరా అధికారి ప్రసాద్, సీఎస్ డీటీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.