90శాతం రాయితీపై మినీ గోకులం పథకం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:42 AM
రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం కాతేరులో ఏర్పాటుచేసిన పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్ , సెప్టెంబరు 11: రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం కాతేరులో ఏర్పాటుచేసిన పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుగణాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దీనిలో భాగంగా పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు 90శాతం రాయితీపై ఎంజీఎన్‌ఆర్జీఎస్ కింద మినీ గోకులం పథకం అమలుచేస్తామన్నారు. పెయ్యి దూడలు మాత్రమే జన్మించేందుకు ప్రత్యేక ఇంజక్షన్‌ను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామని ఈ అవకాశాన్ని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్క పాడిరైతు తమ పశువులకు భీమా చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 80 పశువులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పశువైధ్యాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువెద్యాధికారులు, ఔత్సాహిక పాడిరైతులు స్ధానిక నాయకులు పాల్గొన్నారు.
ఉచిత వైద్యశిబిరం
రూరల్ మండలం వెంకగనగరం పంచాయతీ పరిధిలోగల వెంకటాద్రి ఫంక్షన్ హాల్‌లో కాతేరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఈ శిభిరంలో గుండె వ్యాధులు, కిడ్నీకి సంబందదంచిన, ఫలమనాలజీ, జనరల్ మెడిసిన్, నరములకు సంబంధించిన వ్యాధులకుగాను నగరంలో పలు ఆసుపత్రుల వైద్యులచే సుమారు 1000 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ సుగుణ, గీతా ముళ్ళపూడి, అకిరా కంటి ఆసుపత్రి వైధ్యులు, సేవలందించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.