పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:25 AM
తలుపుల మండలంలోని కుర్లిరెడ్డివారిపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మంగళవారం పింఛన్ల పంపిణీ చేశారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్: తలుపుల మండలంలోని కుర్లిరెడ్డివారిపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మంగళవారం పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్, ఎంపీడీఓ రామనాయక్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు: తలుపుల మండలం లోని బట్రేపల్లిలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్థులు ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సొంత ఖర్చుతో బోరు వేయించి ఆ సమస్య పరిష్కరించారు. దీంతో ఆ గ్రామస్థు లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.