ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు నేటితో గడువు పూర్తి
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:01 AM
గతనెల 29న ప్రచురించిన ముసాయిదా జిల్లా ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు గురువారంతో ముగుస్తుందని జిల్లా రెవిన్యూ అధికారి మోహన్‌కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గతనెల 29న ప్రచురించిన ముసాయిదా జిల్లా ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు గురువారంతో ముగుస్తుందని జిల్లా రెవిన్యూ అధికారి మోహన్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాపై గత నెల 29 నుంచి గురువారం వరకు ఆక్షేపణలు, అభ్యంతరాల స్వీకరణ, క్లెయిమ్‌ల స్వీకరణ కొనసాగిందని చెప్పారు.వాటిని డిసెంబరు 24వ తేదీ లోగా పరిష్కరిస్తామని వివరించారు. తుది ఓటరు జాబితాను 2025 జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. ఈనెల 9, 10, 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియకు 4693 దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు. కొత్తగా ఓటరు నమోదుకోసం ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఇప్పటివరకు ఫారం -6 ద్వారా 46,756 దరఖాస్తులందగా, ప్రస్తుతం 1650 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తొలగింపుల కోసం 30,007 దరఖాస్తులందగా, వాటిలో 21,569 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.మార్పులు, చేర్పుల కోసం 54,914దరఖాస్తులందగా, ప్రస్తుతం 3676 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో వున్నట్లు ఆయన తెలిపారు.