మెడికల్ షాపు యజమానిపై అత్యాచారం కేసు
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:28 AM
ఓ మెడికల్ షాపు యజమాని అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు....తిరుపతి రూరల్ మండలంలో కుప్పుస్వామి హిమ మెడికల్ షాపు నడుపుతున్నాడు.
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబర్ 4 : ఓ మెడికల్ షాపు యజమాని అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు....తిరుపతి రూరల్ మండలంలో కుప్పుస్వామి హిమ మెడికల్ షాపు నడుపుతున్నాడు. ఆస్మాతో బాధపడుతోన్న ఓ కార్మికుడి కుమార్తె (10) బుధవారం సాయంత్రం మెడికల్ షాపులో నెబులైజర్ పెట్టుకుని మందులు తీసుకు వెళ్లేందుకు వచ్చింది.వైద్యం పేరుతో ఆమెను లోపలికి పిలిచిన కుప్పుస్వామి మాయ మాటలతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయపడిపోయిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది.ఆగ్రహంతో మెడికల్ షాపు వద్దకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముద్దాయిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ చిన్నగోవిందు చెప్పారు.