14 మండలాల్లో వర్షం
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:53 AM
జిల్లావ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 14 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పంలో 32.6, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.2 మిమీ వర్షపాతం నమోదైంది.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 4: జిల్లావ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 14 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పంలో 32.6, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.2 మిమీ వర్షపాతం నమోదైంది. విజయపురంలో 27.8, నిండ్ర 22.2, కార్వేటినగరం 21.2, ఐరాల 17.2, నగరి 16.2, గంగవరం 12.4, పలమనేరు 10.8, సదుం 10.2, పుంగనూరు 7.2, పెనుమూరు 6.6, శ్రీరంగరాజపురం 6.6, పూతలపట్టులో 3.2 మి.మీ వర్షపాతం నమోదైంది.