లోయలో పడి చిరుత మృత్యువాత
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:00 AM
సోమల మండలం చిన్నఉప్పరపల్లె పంచాయతీ ఆవులపల్లె బీట్‌లోని చెరువు కోన లోయలో పడి ఓ చిరుతపులి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
సోమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సోమల మండలం చిన్నఉప్పరపల్లె పంచాయతీ ఆవులపల్లె బీట్‌లోని చెరువు కోన లోయలో పడి ఓ చిరుతపులి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. చిరుత పులి మృతి చెందిన ప్రదేశంలో దుర్వాసన వస్తుండడంతో అటవీ శాఖ అధికారులకు పశువుల కాపర్లు సమాచారం చేరవేశారు.చెరువుకోన వద్దకు చేరుకున్న డీఎఫ్‌వో భరణి, తిరుపతి జూపార్క్ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ అరుణ్, సోమల ఏడీహెచ్ శ్రీనివాసులు నాయుడు, పశువైద్యాధికారి చందనప్రియ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎఫ్‌వో భరణి మాట్లాడుతూ చిరుత కళేబరం నుంచి సేకరించిన అవయవాలను తిరుపతి జూపార్క్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు వివరించారు. కాగా ఏనుగుల మంద తరచూ ఈ చెరువు కోనలోనే వుంటూ మండలంలో సంచరించేవి.పుంగనూరు రేంజర్ శ్రీరాములు,చిన్నఉప్పరపల్లె వీఎస్‌ఎస్ చైర్మన్ రమణ, వీఆర్వో శివయ్య , అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.