భక్తి ప్రపత్తులతో కర్వాచౌత్
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:56 AM
చిత్తూరులోని మార్కెట్‌చౌక్, బజారువీధి, జెండామాను వీధుల్లో కర్వాచౌత్ పండుగ సందర్భంగా కోలాహలం నెలకొంది.
చిత్తూరు కల్చరల్, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): చిత్తూరులోని మార్కెట్‌చౌక్, బజారువీధి, జెండామాను వీధుల్లో కర్వాచౌత్ పండుగ సందర్భంగా కోలాహలం నెలకొంది.ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మార్వాడీలు,రాజస్థానీయు లతో పాటు ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ర్టాలకు చెందిన వారు కర్వాచౌత్ పండుగను ఆదివారం భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. యేటా ఆశ్వయుజ మాసంలో తదియ నాడు తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దుర్గామాతకు మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసంతో ఉండి, రాత్రి నిండు చందమామను భర్తకు చూపించి సింధూరం పెడతారు. భర్త ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ప్రసాదాలు తినిపిస్తారు. ఆదివారం రాత్రి చిత్తూరులో వర్షం వచ్చే సూచనలు కన్పించడంతో రాత్రి 10గంటల వరకూ వేచి ఉండి చందమామ దర్శనమిచ్చాక పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా భర్తలు తమ భార్యలకు కానుకలందజేసి సంతోషంలో ముంచెత్తారు.