Donation వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:06 AM
విజయవాడ వరద బాధితుల సహాయార్థం జెట్టి మిస్టర్ కళ్యాణ్ సినీ హీరో మురళీకృష్ణ రూ.పది లక్షల విరాళం అందించారు.
పవన్‌కల్యాణ్‌కు అందజేసిన బంగారుపాళ్యంకు చెందిన సినీహీరో
బంగారుపాళ్యం, సెప్టెంబరు 11: విజయవాడ వరద బాధితుల సహాయార్థం జెట్టి మిస్టర్ కళ్యాణ్ సినీ హీరో మురళీకృష్ణ రూ.పది లక్షల విరాళం అందించారు. ఈయన బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మాధవనగర్‌కు చెందిన చలపతి నాయుడు, భారతి దంపతుల కుమారుడు. రూ.10,00,005 విరాళ చెక్కును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. కాగా, బంగారుపాళ్యంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద ‘హండ్రడ్ డ్రీమ్స్’ అన్నసూక్తం పేరుతో ప్రతిరోజూ నిరుపేదలకు రూ.1కే మురళీకృష్ణ భోజనం అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా తన సొంత ఖర్చులతో పేదలకు ఒక పూట కడుపునిండా అన్నం పెడుతున్నారు.