Disbursement - ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Nov 29 , 2024 | 01:40 AM
డిసెంబరు ఒకటో తేది ఆదివారం. దీంతో ఒకరోజు ముందుగా శనివారమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 2,64,636 మందికి రూ.113 కోట్లు ఈనెల 30న అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు గురువారం తెలిపారు.
మంగళం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): డిసెంబరు ఒకటో తేది ఆదివారం. దీంతో ఒకరోజు ముందుగా శనివారమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 2,64,636 మందికి రూ.113 కోట్లు ఈనెల 30న అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు గురువారం తెలిపారు. ఆ రోజు పింఛన్లు పొందని వారు 2వ తేది (సోమవారం) తీసుకోవచ్చన్నారు.