Collector కలెక్టర్ ఫిజిక్స్ పాఠాలు
ABN , Publish Date - Sep 12 , 2024 | 02:46 AM
రేణిగుంటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.తరగతి గదిలో విద్యార్థినుల నడుమ కూర్చుని ఉపాధ్యాయురాలు బోధిస్తున్న భౌతికశాస్త్రం పాఠాలను ఆసక్తిగా ఆలకించారు.అనంతరం ఆయనే టీచర్‌గా మారి భౌతికశాస్త్రంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు.
రేణిగుంట, సెప్టెంబరు 11: రేణిగుంటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.తరగతి గదిలో విద్యార్థినుల నడుమ కూర్చుని ఉపాధ్యాయురాలు బోధిస్తున్న భౌతికశాస్త్రం పాఠాలను ఆసక్తిగా ఆలకించారు.అనంతరం ఆయనే టీచర్‌గా మారి భౌతికశాస్త్రంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. వారిని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలల్లో రేణిగుంట జడ్పీ బాలికల హైస్కూలు ఒకటన్నారు.ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు, నాణ్యమైన విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలతో పాటు ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.జాయింట్ కలెక్టర్ త్వరలోనే విచారణ జరుపుతారన్నారు. ఆర్.మల్లవరం ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామన్నారు.ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్థిని, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకర్, డీఈ బాలాజీ, కేవీకే రాస్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, ఎంఈవో ఇంద్రాణి, సర్వశిక్ష ప్లానింగ్ అధికారి రామచంద్రారెడ్డి, ఎంపీడీవో విష్ణుచిరంజీవి తదితరులు పాల్గొన్నారు.