Share News

ganja seized 22 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Sep 12 , 2024 | 02:42 AM

గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి అతడి వద్ద 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.తిరుపతి ఈస్ట్‌ పరిధిలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై సీఐ మహేశ్వర రెడ్డి ఇటీవల ప్రత్యేక దృష్టి సారించారు.

ganja seized 22 కిలోల గంజాయి స్వాధీనం

ఒకరి అరెస్టు

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 11: గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి అతడి వద్ద 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.తిరుపతి ఈస్ట్‌ పరిధిలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై సీఐ మహేశ్వర రెడ్డి ఇటీవల ప్రత్యేక దృష్టి సారించారు. కొత్తపల్లి రోడ్డు క్రాస్‌ వద్ద గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో మాటు వేసిన పోలీసులు నగరి మండలం ఓజీ కుప్పం గ్రామానికి చెందిన సత్తుపల్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని అతని వద్ద 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.తిరుపతి మారుతీనగర్‌లో కాపురముంటున్న శ్రీనివాసులు కిలో గంజాయిని రూ.10,000కు కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా మార్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో ప్యాకెట్‌ రూ.300 లెక్కన అమ్ముతున్నట్లు విచారణలో బయటపడింది.

Updated Date - Sep 12 , 2024 | 06:59 AM