చంద్రబాబు, పవన్ దిగ్ర్భాంతి
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:15 AM
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీడిపిక్కల లోడు లారీ బోల్తా కొట్టిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందటంపై తీవ్ర విచారం తీవ్ర వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై బుధవారం ఉదయం ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.