Share News

బై బై గణేశా!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:06 AM

కర్నూలు నగరంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ఆదివారం కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుని భారీ ఊరేగింపు నడుమ వినాయక ఘాట్‌ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

బై బై గణేశా!

కర్నూలులో వైభవంగా నిమజ్జనం

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 15: కర్నూలు నగరంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ఆదివారం కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుని భారీ ఊరేగింపు నడుమ వినాయక ఘాట్‌ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నగరంలో రెండువేలకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేశారు. చివరిగా ఆదివారం సాయంత్రం పాతనగరంలోని రాంభొట్ల దేవాలయం వద్ద విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, పాణ్యం, కోడుమూరు. ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, పార్థసారథి, జేసీ బి.నవ్య, ఎస్పీ బింధుమాదవ్‌, నగర మేయర్‌ బీవై రామయ్య ప్రారంభించారు. నిమజన్జం సందర్భంగా కేసీ కెనాల్‌ వద్ద గల వినాయక ఘాట్‌ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దారిపొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Sep 16 , 2024 | 03:11 AM