Share News

AP News: కాశీలో ఏలూరు జిల్లాకు చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:35 AM

కాశీలో ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన పెరుమాళ్ల లక్ష్మినారాయణ (34), లోకి వినోద్‌లు ఆత్మహత్య చేసుకున్నారు.

AP News: కాశీలో ఏలూరు జిల్లాకు చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారంటే..

ఏలూరు: కాశీలో ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన పెరుమాళ్ల లక్ష్మినారాయణ (34), లోకి వినోద్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ గత మే నెలలో అదృశ్యమయ్యారు. నాలుగు నెలల నుంచి కాశీలో ఒక ఆశ్రమంలో వీరిద్దరూ ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఇద్దరూ తమ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కాశీ పోలీసులు.. ఉంగటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అన్నదమ్ములిద్దరూ నష్టపోయారు. దీంతో వారిద్దరూ కాశీకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారంటూ ముందుగా వార్తలు వచ్చాయి.


అయితే అన్నదమ్ముల ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. క్రికెట్ బుకీ వేధింపుల వల్లనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మృతుడు పెరుమాళ్ల లోకి వినోద్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తమ ఆత్మహత్యకు కారణాలను వెల్లడించాడు. కొందరు వ్యక్తుల కారణంగా తాము ఆత్మహత్యకు పాల్పడ్డామంటూ వారి పేర్లతో సహా వివరించాడు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో అన్నదమ్ముల ఆత్మహత్య కేసు మిస్టరీ కొంత మేర వీడింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:35 AM