Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Oct 19 , 2024 | 10:17 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-10-19T15:35:30+05:30

    కేంద్రమంత్రి బండి సంజయ్ అరెస్ట్..

    • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    • గ్రూప్ 1 అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ జీవో 29కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

    • సెక్రటేరియట్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు.

    • దీంతో పోలీసులు బండి సంజయ్‌ని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అరెస్ట్ చేశారు.

    • బండి సంజయ్ అరెస్ట్‌ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రతోపులాట చోటు చేసుకుంది.

  • 2024-10-19T14:06:55+05:30

    సాక్షిపై కేంద్రానికి, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు..

    • సాక్షి వెబ్‌సైట్‌లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ల వినియోగంపై కేంద్రానికి, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

    • ఏబీఎన్ డీఎస్‌ఎన్‌జి ఫ్రీక్వెన్సీని సాక్షి హ్యాక్ చేసినట్లు ఫిర్యాదు

  • 2024-10-19T13:42:44+05:30

    ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్

    • నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం

    • బాలుడిని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు

    • కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన మణికంఠ అనే బాలుడిని ఆస్పత్రి ఆవరణలోంచి ఎత్తుకెళ్లిన మహిళలు

    • తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తుండగా ఘటన

    • ఏడాదిలో ఇదే ఆస్పత్రిలో ఇది రెండో ఘటన

  • 2024-10-19T13:42:43+05:30

    కొనసాగుతున్న బంద్

    • సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా కొనసాగుతున్న బంద్

    • సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత

    • నిర్మానుష్యమైన సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు

    • మహంకాళి ఆలయం నుంచి విగ్రహం ధ్వంసమైన ఆలయం వరకు ర్యాలీకి ప్రయత్నం

    • ముందస్తు చర్యగా పోలీసుల భారీ బందోబస్తు

  • 2024-10-19T13:36:45+05:30

    చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

    • జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

    • ట్రాక్టర్లపై ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ట్రాక్టర్ డ్రైవర్ల హర్షం..

    • కూటమి నేతల ఆధ్వర్యంలో సీఎం , డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

  • 2024-10-19T12:56:07+05:30

    చలో సెక్రటేరియట్‌కు బండి సంజయ్ పిలుపు

    • గ్రూప్ఖ-1 బాధితులతోె కలిసి చలో సెక్రటేరియట్‌కు బండి సంజయ్ పిలుపు

    • అశోక్‌ నగర్‌లో బాధితులతో కలిసి నిరసన

    • బండి సంజయ్ పిలుపుతో ఉద్రిక్తత వాతావరణం

  • 2024-10-19T12:49:02+05:30

    పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

    • పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

    • పోలీసుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

    • పోలీస్ స్టేషన్ ఎదుట చితిపేరుస్తున్న శ్రీను బంధువులు, తండా వాసులు, బీఆర్ఎస్ నేతలు

    • పోలీసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న శ్రీను మృతదేహాన్ని స్టేషన్ ఎదుటే దహనం చేస్తామంటూ.. చితిపేరుస్తున్న బంధువులు

    • అడ్డుకున్న పోలీసులు

  • 2024-10-19T12:40:14+05:30

    ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఎఫెక్ట్

    • విశాఖ శారద పీఠానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలం అనుమతి రద్దు

    • తిరుమల శ్రీవారి సన్నిధిలో నిబంధనలకు విరుద్ధంగా శారద పీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ కి ఆదేశాలు

    • విశాఖ లో రూ.220 కోట్ల విలువైన 15 ఎకరాల స్థలాన్ని రూ.15 లక్షలకు పీఠానికి ఇచ్చేసిన గత వైసీపీ ప్రభుత్వం

    • భూముల వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తు

    • విశాఖ నుంచి వచ్చిన నివేదికను తొక్కి పెట్టిన కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు

    • నివేదిక దాచడంపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం

    • కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

    • వెంటనే ఫైల్ తెప్పించుకొని అధికారులపై సీరియస్

    • నిబంధనలకు విరుద్ధంగా , ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఉన్న భూమిని కట్టబెట్టడాన్ని రద్దు చేయాలని ఆదేశాలు

    • సోమవారం ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం

  • 2024-10-19T12:18:23+05:30

    గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ..

    • బీజేపీ కార్యాలయం నుంచి అశోక్ నగర్ లైబ్రరీ కి బయలు దేరిన బండి సంజయ్

    • సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు , కార్యకర్తలు

    • నిరుద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడనున్న బండి సంజయ్

  • 2024-10-19T12:17:06+05:30

    బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు

    • బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసిన గ్రూప్ 1 బాధితులు

    • గ్రూప్- 1 బాధితులతో సమావేశమైన బండి సంజయ్

    • రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయిన అభ్యర్థులు

    • హాస్టళ్లలో చదువుకుంటున్న మమ్ముల్ని బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన

    • మహిళలమని చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని ఏడ్చిన మహిళా అభ్యర్థులు

    • గట్టిగా ప్రశ్నిస్తే నక్సల్స్ అని ముద్ర వేసి భయపెడుతున్నారని ఆగ్రహం

    • గ్రూప్ 1 పరీక్షల కోసం రాముడి వనవాసం మాదిరిగా 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందని ఆవేదన

    • తెలుగు అకాడమీ సిలబస్ కూడా చదవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని వాపోయిన అభ్యర్థులు

    • న్యాయం చేయాలని కోరిన అభ్యర్థులు

    బండి సంజయ్ సంపూర్ణ మద్దతు

    • గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బండి సంజయ్

    • మీ పక్షాన బీజేపీ పోరాడుతుందని భరోసా

    • మీరు ప్రశాంతంగా చదువుకోండి... మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ

    నేను కేంద్ర మంత్రినైనా... మీకోసం రోడ్డెక్కుతున్న

    జీతాలిచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న బండి సంజయ్

    అందుకే కావాలనే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడేలా చేస్తోందని వ్యాఖ్య

    అందులో భాగంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా 29 జీవోను జారీ చేసిందన్న కేంద్ర మంత్రి

  • 2024-10-19T12:05:07+05:30

    సిద్దిపేటలో ఉద్రిక్తత

    • నంగునూర్ మండలం నర్మెట్ట గ్రామంలో ఉద్రిక్తత.

    • ఫాం అయిల్ సాగు చేస్తున్న రైతులతో జిల్లా కలెక్టర్ అవగాహన సదస్సు

    • సదస్సుకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవుతారని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు

    • తమకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

    • హరీశ్ రావు గో బ్యాక్ నినాదాలతో నర్మేట్ట వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన

    • భారీగా మోహరించిన పోలీసులు.

  • 2024-10-19T12:01:24+05:30

    వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

    • విశాఖ: మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు

    • లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు

    • ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ నివాసంలోనూ ఈడీ సోదాలు

    • హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

    • మధురవాడ భూమి కొనుగోలు కేసులో ఈడీ సోదాలు

    • రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు

    • ఎండీ జగదీశ్వరుడు, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌ ఓనర్‌ రాధారాణి ఇళ్లల్లో సోదాలు

    • తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ఎంవీవీ సత్యనారాయణ

    • గీతాంజలి, అభినేత్రి, నీవెవరు సినిమాలు తీసిన ఎంవీవీ

    • 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు

    • ఎంవీవీ అడిటర్‌ వెంకటేశ్వరరావుతో పాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు

  • 2024-10-19T11:42:46+05:30

    ముగిసిన లోకేష్ విశాఖ పర్యటన

    • ముగిసిన మంత్రి లోకేష్ రెండు రోజుల విశాఖ పర్యటన

    • విశాఖ విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరిన మంత్రి నారా లోకేష్

    • అనుకున్న సమయానికి రెండు గంటలు ముందుగా విశాఖ ఎయిర్ పోర్ట్‌కి లోకేష్

    • లోకేష్‌కు విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన టీడీపీ శ్రేణులు

  • 2024-10-19T11:21:27+05:30

    కేటీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

    • కేటీఆర్ అరవకు , మొరగకు

    • ఇప్పటికే నిన్ను ప్రజలు చి..తు అంటున్నారు

    • హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పైసలు ఇచ్చింది మీరే కదా

    • ఫోన్ ట్యాపింగ్ అంశంలో నువ్వు, మీ నాన్న దోషులు

    • ఎందుకు మిమల్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం లేదు

    • నువ్వు మీ నాన్న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకున్నది నిజం కాదా

    • రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ కి అప్పగించాలి

    • మేము కూడా కేంద్ర ప్రభుతం తరుపున సిబిఐని రిక్వెస్ట్ చేస్తాం

  • 2024-10-19T11:06:06+05:30

    విచారణకు కవిత..

    • రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ

      దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ

    • విచారణ జరిపిన జడ్జి కావేరి బవేజా

    • విచారణకు వర్చువల్‌గా హాజరైన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు

    • కేసు విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా

  • 2024-10-19T10:17:33+05:30

    మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు..

    • టీడీపీ కార్యాలయంలో పలువురు నుంచి వినతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్

    • సీఎం సహాయ నిధికి విరాళాన్ని నారా లోకేష్‌కు అందజేసిన ఫిల్మ్ నగర్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు

    • టీడీపీ కార్యాలయం నుంచి ఆకస్మిక తనిఖీల కోసం బయలుదేరిన నారా లోకేష్

    • ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బయలుదేరిన నారా లోకేష్