మిరప సాగుపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:18 AM
మిరప పంటసాగుపై రైతులు అవగా హన పెంచుకోవాలని కోవెలకుంట్ల ఏడీఏ సుధకర్ తెలిపారు.
ఉయ్యాలవాడ, అక్టోబరు 1: మిరప పంటసాగుపై రైతులు అవగా హన పెంచుకోవాలని కోవెలకుంట్ల ఏడీఏ సుధకర్ తెలిపారు. ‘పొలం పిలు స్తోంది’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హరివరం, నర్శిపల్లె, పడిగె పాడు గ్రామాల్లో ఏడీఏ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మిరప పంట సాగులో మెలకువలు పాటించాలన్నారు. మోతా దుకు మించి ఎరువులు, మందులు వాడరాదన్నారు. డివిజన పరిధిలోని ఆ రు మండలాల్లో 65వేల ఎకరాల్లో పంట సాగు అయ్యిందన్నారు.
25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు
రబీ సీజనలో రైతులు సాగుచేసే శనగ పంటకు 25 శాతం సిబ్సడీతో శనగ విత్తనాలు మంజూరు చేస్తున్నామని వ్యవసాయ ఏడీఏ సుధాకర్ తెలిపారు. డివిజన పరిధిలోని ఆరు మండలాల్లో ఈ ఏడాది 1,15,000 ఎకరాల్లో శనగ పంట సాగు అయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 22 వేల క్వింటాల విత్తనాలు అవసరం అయినట్లు గుర్తించి ప్రతి పాదనలు పంపామన్నారు. ప్రభుత్వం పూర్తి ధర క్వింటా రూ. 9 వేలు కాగా ప్రభుత్వ సబ్సిడీపోను రైతులు రూ. 7,050 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు మూడు నుండి రైతు సేవా కేంద్రాలలో రిజిసే్ట్రషన్లు ప్రారంభం అవుతాయన్నారు.