road accident రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:19 AM
మండలంలోని ధర్మా పురం గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
గుత్తి రూరల్, సెప్టెంబరు 15: మండలంలోని ధర్మా పురం గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
గుత్తికి చెందిన నరసింహ, పర మేష్ ఆదివారం బైక్‌లో ప్యాపిలికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ధర్మాపురం గ్రామాశివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు వెంటనే వారిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..