mla kalava గ్రామాల అభివృద్ధే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:45 AM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో సోమవారం తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దాస్‌నాయక్ పల్లెపండుగ కార్యక్రామన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వారితో కలిసి సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
- పల్లె పండుగలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
బొమ్మనహాళ్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో సోమవారం తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దాస్‌నాయక్ పల్లెపండుగ కార్యక్రామన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వారితో కలిసి సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో 416 అభివృద్ధి పనులకు రూ. 16 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ మేరకు బొమ్మనహాళ్ మండలానికి 83 పనులకు రూ. 3 కోట్లు, కణేకల్లు మండలానికి 93 పనులకు రూ. 4.1 కోట్లు, డీ.హీరేహాళ్ మండలానికి 71 పనులకు రూ. 2.75 కోట్లు, గుమ్మఘట్ట మండలానికి 105 పనులకు రూ. 3.1 కోట్లు, రాయదుర్గం రూరల్ మండలానికి 64 పనులకు రూ.2.55 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పల్లె పండుగ పే రుతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామా ల్లో సౌకర్యాలు మెరుగు పరచడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి, నాయకులు కొత్తపల్లి మల్లికార్జున, ముల్లంగి నారాయణస్వామి, తిమ్మరాజు, నవీన, హనుమంతు, సంగప్ప, సల్లాపురం బాబు, పయ్యావుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..