Share News

SP RATHNA: ఎక్కువ కేసులు పరిష్కరించండి

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:22 AM

కక్షిదారులకు లోక్‌ అదాలతపై అవగాహన కల్పించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ వి.రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్‌లో కోర్టు కానిస్టేబుళ్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

SP RATHNA: ఎక్కువ కేసులు పరిష్కరించండి

సమీక్షా సమావేశంలో ఎస్పీ రత్న

పుట్టపర్తిరూరల్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు లోక్‌ అదాలతపై అవగాహన కల్పించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ వి.రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్‌లో కోర్టు కానిస్టేబుళ్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబరు 14న జాతీయమెగా లోక్‌ అదాలత జరుగుతుందని, ఇందులో భాగంగా కక్షిదారులకు అవగాహన కల్పించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. లోక్‌అదాలతలో రాజీ చేయదగిన క్రిమినల్‌, సివిల్‌ కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఇతర కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దీని వల్ల సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు. ఎక్కువ కేసులు పరిష్కారానికి చొరవచూపే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథరెడ్డి, సీసీఎస్‌ సీఐ శివాంజనేయులు, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:22 AM