Share News

People don't trust YCP వైసీపీని జనం నమ్మరు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:50 AM

గత ఐదేళ్లూ అపద్ధాలు చెప్పి ప్రజలకు నరకాన్ని చూపిన జగనను, వైసీపీని ప్రజలు ఇక ఎన్నటికీ నమ్మరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం ఆయన నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

People don't trust YCP  వైసీపీని జనం నమ్మరు
పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకులు

పింఛన్ల పంపిణీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌

గుంతకల్లు, అక్టోబరు 1: గత ఐదేళ్లూ అపద్ధాలు చెప్పి ప్రజలకు నరకాన్ని చూపిన జగనను, వైసీపీని ప్రజలు ఇక ఎన్నటికీ నమ్మరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం ఆయన నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర పింఛనుదారులకు ఒక్కసారిగా పింఛన మొత్తాన్ని భారీగా పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి చేదోడుగా నిలిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ. వెయ్యి పెంచడానికి ఐదేళ్లు ఆపసోపాలు పడిందన్నారు. ఐదేళ్ల పాటు నరకం చూపించిన జగనను, ఆయన పార్టీని ప్రజలు ఇక జన్మలో నమ్మరని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ స్వామి, బండారు ఆనంద్‌, బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, పత్తి హిమబిందు, ఉడదాల ప్రభాకర్‌, శివన్న, రాయల్‌ వెంకటేశులు, ఫజులు, చికెన జగన, పెంచలపాడు వెంకటేశులు, ఆటో ఖాజా, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 02 , 2024 | 12:50 AM