Share News

Mutavalli ముస్లింల పక్షపాతి చంద్రబాబు

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:07 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల పక్షపాతి అని, ముస్లింల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముతవల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్‌ షఫి అన్నారు.

Mutavalli ముస్లింల పక్షపాతి చంద్రబాబు
చంద్రన్న మదరసా నవీన విద్యాపథకంపై హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లింలు

ముతవల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షకీల్‌ షఫి

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల పక్షపాతి అని, ముస్లింల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముతవల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్‌ షఫి అన్నారు. చంద్రన్న మదరసా నవీన విద్యా పథకం అమలుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డ్రైవర్స్‌ కాలనీలోని సబేలుల్‌ ముమినీన మదరసా వద్ద మదరసా విద్యార్థులు, మతపెద్దలతో శనివారం సమావేశం నిర్వహించారు. వైసీపీ హయాంలో మదరసాలు మూసివేసే పరిస్థితుల్లో ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఒక్కో మదరసాకు ముగ్గురు విద్యా వలంటీర్లు చొప్పున మొత్తం 555 మంది నియామకానికి ప్రతిపాదన సిద్ధం చేయడం హర్షనీయమని అన్నారు. ఉర్దూ మీడియం పాఠశాలల్లో టీచర్ల నియామకం సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను అడగకనే టీడీపీ ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు తాజుద్దీన, షౌకతఖాన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:08 AM