Share News

police watch: పోలీసు పహారా నడుమ ఇంటర్వ్యూలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:49 AM

సమగ్రశిక్ష ప్రాజెక్టులో సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారుల ఎంపిక ఇంటర్వ్యూలు పోలీసుల పహారా నడుమ మంగళవారం నిర్వహించారు. ప్రాజెక్టులోని డీపీసీ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఈఓ వరలక్ష్మి, ఏసీపీ నాగరాజు, డైట్‌ ప్రిన్సిపాల్‌ రవిసాగర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూలు అని చెప్పినా ఆలస్యంగా ప్రారంభించారు.

police watch: పోలీసు పహారా నడుమ ఇంటర్వ్యూలు
Police on guard at DPC chamber

ఆరోపణలు ఉన్న వారిని పిలవడంపై విమర్శలు

ఎస్‌ఎస్‌ఏ ఇంటర్వ్యూలకు 13 మంది హాజరు

అనంతపురం విద్య, అక్టోబరు 1: సమగ్రశిక్ష ప్రాజెక్టులో సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారుల ఎంపిక ఇంటర్వ్యూలు పోలీసుల పహారా నడుమ మంగళవారం నిర్వహించారు. ప్రాజెక్టులోని డీపీసీ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఈఓ వరలక్ష్మి, ఏసీపీ నాగరాజు, డైట్‌ ప్రిన్సిపాల్‌ రవిసాగర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూలు అని చెప్పినా ఆలస్యంగా ప్రారంభించారు. వివిధ రకాల ఆరోపణలు ఉన్న వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గతంలో కేజీబీవీల్లో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించి, ఆరోపణలు ఎదుర్కొన్న వారు, వైసీపీ హయాంలో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో నాయకుల ముందు, వెనుక నడిచిన వారిని సైతం జిల్లా ఎంపిక కమిటీ మళ్లీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించడంపై విమర్శలు వెళ్లువెత్తాయి. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సంఘాల నేతలు అక్కడే నిరసన తెలపాలని చూశారు. ఇది ముందుగా పసిగట్టిన అధికారులు పోలీసులను రప్పించి, ఖాకీ నీడన ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 14 మంది అభ్యర్థులకుగా 13 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:49 AM