Share News

Award: అమిలినేనికి అంతర్జాతీయ పురస్కారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:44 AM

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మహాత్మాగాంధీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఎనఆర్‌ఐ వెల్ఫేర్‌ సొసైటీ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. లండనలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మ్యూజియంలో ఎనఆర్‌ఐ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహిస్తున్నారు.

Award: అమిలినేనికి అంతర్జాతీయ పురస్కారం
amilineni at the Ambedkar statchu

మహాత్మాగాంధీ లీడర్‌షిప్‌ అవార్డు ప్రకటించిన ఎనఆర్‌ఐ వెల్ఫేర్‌ సొసైటీ

కళ్యాణదుర్గం, అక్టోబరు 1: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మహాత్మాగాంధీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఎనఆర్‌ఐ వెల్ఫేర్‌ సొసైటీ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. లండనలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మ్యూజియంలో ఎనఆర్‌ఐ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 125 మంది ఎనఆర్‌ఐ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇదే సందర్భంలో అమిలినేనికి అవార్డును అందజేస్తారు. ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు సమాజానికి విశిష్ట సేవలు అందించేవారికి ఏటా గాంధీ జయంతి రోజున ఈ అవార్డును అందజేస్తారు. అవార్డును అందుకునేందుకు ఎమ్మెల్యే లండన వెళ్లారు.

Updated Date - Oct 02 , 2024 | 12:44 AM