ENGINEERS DAY : ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:27 AM
ఇంజనీర్ల తయారీ కేంద్రంగా ప్రపంచదేశాలను ఇండియా అధిగమిస్తోందని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురష్కరించుకుని ఆదివారం జేఎనటీయూలో ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. మోక్షగుండం విగ్రహానికి వీసీ సుదర్శన రావు తదితరులు నివాళులర్పించారు.
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 15 : ఇంజనీర్ల తయారీ కేంద్రంగా ప్రపంచదేశాలను ఇండియా అధిగమిస్తోందని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురష్కరించుకుని ఆదివారం జేఎనటీయూలో ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. మోక్షగుండం విగ్రహానికి వీసీ సుదర్శన రావు తదితరులు నివాళులర్పించారు. ఓస్‌డీటూ వీసీ దేవన్న, డైరెక్టర్లు సత్య నారాయణ, వైశాలి గోర్పాడే, ప్రశాంతి, సుజాత, ఈశ్వర్‌రెడ్డి, సురేషబాబు, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వసుంధర, డీఈ శివలింగ రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం సిటి, సెప్టెంబరు15 : మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహా అద్భుతాలు సృష్టించవచ్చునని నిరూపించిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆర్‌అండ్‌బీ ఈఎనసీ నయీముల్లా కొని యా డారు. స్థానిక అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం మోక్షగుండం విశ్వేశ్వర య్య జయంతిని నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథులుగా హజరై మోక్ష గుండం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్ర మంలో ఆశాఖ ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, ఎనహెచ ఎస్‌ఈ హరిప్రసాద్, ఈఈలు ప్రసాద్‌రెడ్డి, రాజగోపాల్, పలువురు డీఈఈలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం సిటీ: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ పనిచేయాలని హౌసింగ్ పీడీ శైలజ సూచించారు. స్థానిక హౌ సింగ్ శాఖ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళ్లుర్పించారు. పలువురు అధికారులను శాలువాతో సత్క రించి మొమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఈలు లక్ష్మీనారా యణమ్మ, క్రిష్టారావు, దేవరకొండ రామ్మూర్తి, షాషా వలి, హనుమప్ప, రంగసప్వామి, ఏఈలు జమీల్‌అహ్మద్, శివారెడ్డి, శ్రీనివాసులు, మేనేజర్ ఆల్తాప్‌హూసేన, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం సిటి: నగరంలోని స్థానిక క్వాలీటి కంట్రోల్ విభాగంలో ఆది వారం మోక్షగుండం జ యంతి వేడుకలను నిర్వ హించారు. డీఈఈ లక్ష్మీనా రాయణ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సిబ్బందితో కలిసి ని వాళులర్పించారు. పీఆర్ ఐ సబ్ డివిజన-1, క్యూసీ విభా గం సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం క్రైం: నగరంలోని నిట్కాన గ్రూప్స్ కార్యాలయంలో ఆదివా రం ఇంజనీరింగ్ డేని ఘనంగా జరుపుకున్నారు. గ్రూప్స్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, మురళీకృష్ణ, క్రెడాయ్ ప్రెసిడెంట్ అపెక్స్ తిరుపాలు, ప్రధాన కార్యదర్శి నిట్కాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. క్వాలిటీ, వినూత్న సాంకేతికతలను వినియోగించుకుని మోక్షగుండం ఆశయాలు కొనసాగించాలన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....