చెత్త నుంచి సంపద కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:13 AM
స్థానిక బస్టాండ్ సమీపంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ చేతన బుధవారం పరిశీలించారు.
కదిరి(అమడగూరు), సెప్టెంబరు 11 : స్థానిక బస్టాండ్ సమీపంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ చేతన బుధవారం పరిశీలించారు. నిర్వహణ సరిగా లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. సంపద కేంద్రాలకు ఇప్పటివరకు జిల్లా పేరు మార్చకపోవడంపై ఆయన మండి పడ్డారు.
అనంతరం స్థానిక సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం, వెలుగు, వ్యవసాయ గోదాములను ఆయన పరిశీలించారు. అనం తరం మహమ్మదాబాద్ సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వాహణ సజావుగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కేంద్రాలు ఇలా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కేంద్రం వద్ద మామిడి మొ క్కలు నాట్టారు. ఆయన వెంట ఎంపీడీఓ మునియప్ప, ఎంఈఓ జిల్లాన బాషా, ఏపీ ఎం, ఏపీఓ, ఏఈ గురురాజుగుప్త, పంచా యతీ కార్యదర్శులు చంద్ర, అనిల్‌కుమార్, సుదర్శన, సర్పంచ షబ్బీర్ ఉన్నారు.