Education విద్యకు పెద్ద పీట: విప్ కాలవ
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:54 AM
కూటమి ప్రభుత్వమే విద్యకు పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
కణేకల్లు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వమే విద్యకు పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ... గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఉపాధ్యాయులను అందించిందన్నారు. అలాగే ఇటీవల కూటమి సర్కార్ 16 వేల పైచిలుకు డీస్సీ పోస్టుల భర్తీకి గ్రీనసిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓలు లక్ష్మణ్ణ, భవానీశంకర్ , ఉర్దూ పాఠశాల హెచఎం రహంతుల్లా, టీడీపీ నాయకులు ఆనంద్‌రాజ్, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, షేక్‌ముజ్జు, బాయినేని నవీన, చంద్రశేఖర్‌గుప్తా, కురుబ నాగరాజు, ఎంపీటీసీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..