ట్రాన్సకో కార్యాలయం ఎదుట ధర్నా
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:09 AM
మండల కేంద్రంలోని గంగమ్మగుడి కాలనీకి చెందిన పలువురు ట్రాన్సకో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు.
కొత్తచెరువు, సెప్టెంబరు 11: మండల కేంద్రంలోని గంగమ్మగుడి కాలనీకి చెందిన పలువురు ట్రాన్సకో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. తమ కాలనీకి విద్యుత ట్రాన్స ఫార్మర్ ఏర్పాటు చేయాలని, అదనంగా విద్యుత స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని అన్నారు.
దీంతో తాము కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని, హై ఓల్టెజ్‌తో బల్పులు, టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోతున్నాయని వాపోయారు. ఈ సమస్యలతో విసుగుచెంది ధర్నా చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు.