సైబర్ నేరాల కట్టడిపై అవగాహన
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:08 AM
అంతర్జాల మోసాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు అడ్డుకోవడంపై స్థానిక శ్రీశక్తి భవనలో ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 11: అంతర్జాల మోసాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు అడ్డుకోవడంపై స్థానిక శ్రీశక్తి భవనలో ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్‌గ్రూమింగ్ ద్వారా అపరిచిత వ్యక్తులు ఆనలైనలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, అనుచితమైన సందేశాలు పంపడం తదితర వాటి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేష్, జిల్లా కో-ఆర్డినేటర్ అలెస్కో ఆనందబాబు, లలిత వివరించారు.
కార్యక్రమంలో సీఐఎఫ్ జిల్లా ప్రతినిధి కొండప్ప, జిల్లా బాలల పరిరక్షణ సమితి ప్రొటక్షన ఆఫీసర్ మురళి, నాగలక్ష్మి, శిశుగృహ మేనేజర్ సునీత, సోషియల్ వర్కర్ ఆనంద్, యూడ్ అంబాసిడర్లు దేదీప్య, షెహతాజ్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.