Share News

POLLUTION : ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలి

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:10 AM

దీపావళి అంటే దీపాల పండుగగా జరుపుకొని... ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలని ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఎన్విరాని మెంటల్‌ ఇంజనీర్‌ బీవై మునిప్రసాద్‌ పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాజేంద్రప్రసాద్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ‘దీపావళి పండుగ ప్రాధాన్యత - టపాసులు, దీపాలు, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

POLLUTION : ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలి
Artists and officials explaining the importance of Diwali festival

ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఈఈ

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దీపావళి అంటే దీపాల పండుగగా జరుపుకొని... ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలని ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఎన్విరాని మెంటల్‌ ఇంజనీర్‌ బీవై మునిప్రసాద్‌ పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాజేంద్రప్రసాద్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ‘దీపావళి పండుగ ప్రాధాన్యత - టపాసులు, దీపాలు, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మునిప్రసాద్‌ మాట్లాడుతూ దీపావళి పండుగ కుల, మతాలకు అతీతంగా జరుపుకునే ప్రతిష్టాత్మక, పవిత్రమైన సందర్భమని తెలిపారు. దీపావళి పండుగను టపాసుల మోతతో కాకుండా దీపాల వెలుగులో జరుపుకోవాలని కోరారు. ఽప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని రక్షించాలని వివరించారు. దీపావళి పండుగ ప్రాధాన్యతపై కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజినేయులు, ఏపీపీసీ బీ ఏఈ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాజాత బృందం తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 31 , 2024 | 12:10 AM