old students పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:39 AM
మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆ పాఠశాలలో 1995-96 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న 76 మంది విద్యార్థులు సుమారు 28 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలోనే కలిశారు.
బెళుగుప్ప, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆ పాఠశాలలో 1995-96 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న 76 మంది విద్యార్థులు సుమారు 28 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలోనే కలిశారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి గురువులు వెంకటరమణ, రామకోటి, దస్తగిరి, వెంకటరామయ్య, రత్నమ్మ, వెంకటస్వామి, రామకృష్ణ, కృష్ణమూర్తి, వెంకటప్రసాద్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఎంఈవో మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలాజీ, తిమ్మారెడ్డి, శివయ్య, గంగాధర, శివ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..