కూటమి సేవలు ఆదర్శనీయం

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:37 PM

విజయవాడలో వరద బాధితులకు ముఖ్యమంత్రితో పాటు కూటమి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు అక్కడే ఉండి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు.

ఓబుళదేవరచెరువు, సెప్టెంబరు 10 : విజయవాడలో వరద బాధితులకు ముఖ్యమంత్రితో పాటు కూటమి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు అక్కడే ఉండి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. మండలంలోని ఉట్లవారిపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబునాయుడు 75 ఏళ్లలోనూ వరద ప్రాంతాల్లో పర్యటించి, బాఽధితులను ఆదుకొంటున్నారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అనేక మంది వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. తనవంతు సాయంగా నియోజక వర్గం నుంచి వెయ్యి క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, ముఖ్యమంత్రికి త్వరలో అందచేస్తామన్నారు. వారి వెంట మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, పీట్ల సుధాకర్‌, ఉంట్ల మహేశ్వర్‌రెడ్డి, కుర్లి శివారెడ్డి, జౌలి బాబా, బోరు రమణ, శ్రీనివాసరెడ్డి, కుర్లి గంగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, నిజాం, ఆంజనప్ప ఉన్నారు.


నల్లమాడ : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా టీడీపీ మండల కన్వీనర్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో నాయకులు వంద క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సరుకులు సేకరించారు. నల్లమాడలో వాటిని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అలాగే చౌటకుంటపల్లిలో టీడీపీ నాయకులు పది బస్తాల బియ్యాన్ని సేకరించారు. కార్యక్రమంలో నాయకులు మంజునాథ్‌రెడ్డి, రామచంద్ర, బుట్టి నాగభూషణం నాయుడు, సలాంఖాన, గనరెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి, చందనబాబు, గోరేసాబ్‌, నాగరాజు, దస్తగిరివలీ, వేణుగోపాల్‌, బాబావలీ, రహీమాన, తోసీప్‌, డీలర్లు నాగరాజు, శంకర్‌, సలీంబాషా, మధుసూధనరెడ్డి వెలుగు రామలక్ష్మీమ్మ పాల్గొన్నారు.


టీడీపీలోకి వైసీపీ సర్పంచ

కదిరి, (అమడగూరు) : మండలంలో లోకోజుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో అమడగూరు వైసీపీ సర్పంచ షబ్బీర్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Updated at - Sep 10 , 2024 | 11:37 PM