రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:30 AM
మండలంలోని నల్లగుట్లపల్లికి చెందిన భార్గవ్ (25) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించాడు. భార్గవ్ బోలోరా వాహనం పెట్టుకుని డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
తనకల్లు, అక్టోబరు 1 : మండలంలోని నల్లగుట్లపల్లికి చెందిన భార్గవ్ (25) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించాడు. భార్గవ్ బోలోరా వాహనం పెట్టుకుని డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లాలోని ములకచెరువుకు టమోటాలు తీసుకెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. చీకటిమాను పల్లి సమీపంలో ఈదులవంక వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్గవ్ అక్కడిక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ గోపీ తెలిపారు. భార్గవ్‌కు వివాహం కాలేదు. చేతికొచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు రాజమ్మ, నారాయణప్ప బోరున విలపించారు.